ధ్రువముల చివరలు చూసిన దృఢ సంకల్పం ఒక్కరిది జలధుల లోతులు ఈదిన స్థిర సంకల్పం ఒక్కరిది కలను సాధించు గెలుపే కాంతి సంతకమగును బూర్ల గ్రహముల గతులను కొల్చిన ఘన సంకల్పం ఒక్కరిది జన్మల జడలను విప్పిన ముని సంకల్పం ఒక్కరిది * అడుగులెన్ని పడితే అయ్యెనోయి అడుసు అంటని త్రోవ చుక్కలెన్ని చేరితే జారెనోయి గుక్క గుక్కను జావ ఒక్కటి ఏదైనా కానీ ఒంటరిదౌతుందోయి బూర్ల గింజలెన్ని కూడి తె ఉడికెనోయి గిన్నెలొ సోలెడు బువ్వ చిక్కులెన్ని తీరి తె సాగెనోయి చక్కగ జీవన నావ * ఎంత కాలం వేచి ఉంటే విత్తు పూసెను పువ్వుగా ఎంత దుఃఖం ఆవిరై తే కడుపు పండెను నవ్వుగా కొంత ఓర్పు నీలోఉంటే కొరత లేదురా బూర్ల ఎంత జ్ఞానం హవన మైతే కలలు మొలచెను మొవ్వుగా ఎంత ఉష్ణం జ్వలనమైతే లోహమయ్యెను మువ్వగా * గుట్టలనే మింగే వాడికి గుడ్డొక లెక్కా అడవులనే కాల్చే వాడికి ఆకొక లెక్కా తినీ తినీ త్రేన్చే దుష్టుల తరుమర బూర్లా ఓటరునే కొనే వానికి నోటొక లెక్కా దేశాన్నేదోచే వానికి దేవుడు లెక్కా * చెట్టు ఎంతగ ఎదిగితే ఒక పువ్వు పుడుతుంది మనసు ఎంతగ కరిగితే ఒక నవ్వు పుడుతుంది ఏది ఎప్పుడు ఊరికేనె...