Posts

Showing posts from 2016

మానవ నక్షత్రాలు

Image

పంచ పదులు

ధ్రువముల చివరలు చూసిన దృఢ సంకల్పం ఒక్కరిది జలధుల లోతులు ఈదిన స్థిర సంకల్పం ఒక్కరిది కలను సాధించు గెలుపే కాంతి సంతకమగును బూర్ల గ్రహముల గతులను కొల్చిన ఘన సంకల్పం ఒక్కరిది జన్మల జడలను విప్పిన ముని సంకల్పం ఒక్కరిది  * అడుగులెన్ని పడితే అయ్యెనోయి అడుసు అంటని త్రోవ చుక్కలెన్ని చేరితే జారెనోయి గుక్క గుక్కను జావ ఒక్కటి ఏదైనా కానీ ఒంటరిదౌతుందోయి బూర్ల గింజలెన్ని కూడి తె ఉడికెనోయి గిన్నెలొ సోలెడు బువ్వ చిక్కులెన్ని తీరి తె సాగెనోయి చక్కగ జీవన నావ  * ఎంత కాలం వేచి ఉంటే విత్తు పూసెను పువ్వుగా ఎంత దుఃఖం ఆవిరై తే కడుపు పండెను నవ్వుగా కొంత ఓర్పు నీలోఉంటే కొరత లేదురా బూర్ల ఎంత జ్ఞానం హవన మైతే కలలు మొలచెను మొవ్వుగా ఎంత ఉష్ణం జ్వలనమైతే లోహమయ్యెను మువ్వగా  * గుట్టలనే మింగే వాడికి గుడ్డొక లెక్కా అడవులనే కాల్చే వాడికి ఆకొక లెక్కా తినీ తినీ త్రేన్చే దుష్టుల తరుమర బూర్లా ఓటరునే కొనే వానికి నోటొక లెక్కా దేశాన్నేదోచే వానికి దేవుడు లెక్కా  * చెట్టు ఎంతగ ఎదిగితే ఒక పువ్వు పుడుతుంది మనసు ఎంతగ కరిగితే ఒక నవ్వు పుడుతుంది ఏది ఎప్పుడు ఊరికేనె...

http://vaakili.com/patrika/?p=12793

పంచ పదులు

సీసెడు బీరు కోసం శీలాన్ని తుంగలో తొక్కకు  కీసెడు పుట్నాలకు మనుషులను గోస పెట్టి సంపకు ఏది మంచిదో కాదో ఎదను అడిగి తెలుసుకో బూర్ల బుక్కెడు బువ్వకే నీ బుద్ది గడ్డి మీదికి మలుపకు జానెడు పొట్ట కోసం జాలిని అటుకు మీద పెట్టకు * ఎంత గొప్ప ఇల్లు కడితే ఏమున్నది మానవా  ఎంత ఎత్తున నిల్చుంటే ఏమున్నది మానవా  కొంత దయలేక మనిషి వింత జంతువు గదర బూర్ల బండలు ఎంతగ ఎదిగినా ఏమున్నది మానవా కండలు ఎంతగ పెరిగినా ఏమున్నది మానవా *  చెట్టును కొట్టీ విత్తును నాటే పని ఎందుకురా పొట్టను కొట్టీ బిక్షను పెట్టే సిరి ఎందుకురా మనసుకు జవాబు చెప్పని నటనెందుకురా బూర్ల తట్టలు మోసీ మట్టిని మరిచే గుణమెందుకురా కట్టలు చూసీ చేతులు కట్టే మనిషెందుకురా *  దానశీలతను నీళ్ళ పాలు చేస్తున్న దైవమా నీకో వందనం  కార్యశీలతను గుళ్ళ పాలు చేస్తున్న ధర్మమా నీకో వందనం మనిషి ముఖం పట్టని హీనుల – ఏ సిద్ధాంతం కాపాడదురా బూర్ల స్వార్థ పరతకు శాశ్వత హుండి తెరచిన సంఘమా నీకో వందనం దుష్ట చరితకు తొవ్వ తీసిన తుచ్చమనువాదమా నీకో వందనం *  మనసు నొప్పి మాయమవగా మాట వెన్న రాసినట్టు వయసు బాధ తేలిపోగా ఊత కర్ర నిల...
Image
ఆంధ్రభూమి సాహితి పేజీ 21.11.2016

ఒక్కసారి రారా తమ్మీ!

నిండూ ఎన్నీల నాడు ఓ లచ్చ గుమ్మడి పొంగినాది పాల వాగు ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| పాల వాగు పారుతుంటే ఓ లచ్చ గుమ్మడి మా మనుసు నీరు అయ్యి పారే ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| నీళ్ళ మెరుపు ఎంత సలువ ఓ లచ్చ గుమ్మడి ఆ నీళ్ళ సప్పుడెంత సుతి ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| పొట్టా కూటికి జచ్చి ఓ లచ్చ గుమ్మడి పొద్దంత పని జేసి ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| అవ్వా అయ్యా నిన్నూ దలిసి ఓ లచ్చ గుమ్మడి ఒక్క ముద్దా తిందామని ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| అన్నంలోన నిన్నూ జూసి ఓ లచ్చ గుమ్మడి ముద్దాలన్నీ వాగులేసే ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| సుక్క పోద్దూవోలె నువ్వు ఓ లచ్చ గుమ్మడి ఒక్కసారి రారా తమ్మీ ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| నిండూ ఎన్నీల నాడు ఓ లచ్చ గుమ్మడి పొంగినాది పాల వాగు ఓ లచ్చ గుమ్మడి

ఒక్క తీరు దుఃఖం

భౌగోళికాలు మనుషులను ఎకేరు చెయ్యకపోవచ్చు ఒక్క ఇల్లే రెండు వక్కలు ఐనప్పుడు ఒక బాధ ఉంటది గద - పోరాటం జేసి విడిపోవుడు వేరు పోరువెట్టి విడగొట్టుడు వేరు - ఎవల ప్రయోజనాలు వాళ్లకు ఉంటయి గావచ్చు నీది వేరే జిల్ల అనే ఒక కంచెనైతే పాతిండ్రు గద - ఊల్లెదూల్లెనే చెల్లె మరొకలింటికి వోతె కంటి శోకం తియ్యని మనిషి ఉంటడా - మనుషుల నడుమ ఒక నున్నటి తీగె అల్లుకొని ఉంటది అది బొడ్డు పేగే కాకపోవచ్చు ఒక గుట్ట, ఒక పుట్ట, ఒక మట్టి ఒక నది నీరు, ఒక దేవుని బొట్టు, ఒక స్థూపం యాది -- ఇంకా మాట్లాడితే ఒక్క తీరు మాట ఒక్క తీరు పాట ఒక్క తీరు ఆరాటం ఒక్క తీరు పోరాటం -- భౌగోళికాలు మనుషులను ఎకేరు చెయ్యకపోవచ్చు ఒక్క తీరు అల్లుకపోయిన తీగెలు ఎక్కడికైనా పాకవచ్చు బాధ ఒక్కటే, మనుసు ఒక్కటే, బతుకు ఒక్కటే కాళ్ళనూ చుట్టవచ్చు బరిసెనూ పట్టవచ్చు పోరాటాన్నీ నిలబెట్టవచ్చు పొట్టోని నెత్తిని పొడుగోడుగొడితే పొడుగోని నెత్తిని పోశమ్మ కొట్టనూ వచ్చు

పచ్చని చెట్టు లాంటి ప్రేమ

పచ్చని చెట్టు లాంటి ప్రేమ ఈ విశ్వానికి ఆక్సిజన్ వేళ్ళు పెకిలిస్తే సూర్య రశ్మితో తలెత్తుకుంటుంది తల నరికితే వేళ్ళ ఆసరాతో చిగురిస్తుంది అయినా చెట్టు లేకుండా శ్వాస ఉంటుందా ప్రేమించకుండా మానవ జాతి బతుకుంటుందా గుండెల్లో పొంగే గంగను దోసిట్లోకి ఒంపితే ప్రేమ బండలను పూల పుప్పొడిలా మారిస్తే ప్రేమ కన్నీటి కెరటాల జీవిత సంద్రం మీద వెన్నెల నావలా సాగితే అది ప్రేమ రెండు హృదయాల ఏక నాదం ప్రేమ రూపాయికీ రూపానికీ మోహానికీ శోకానికీ శాపాలకీ శాసనాలకీ చెంప దెబ్బ ప్రేమ సజీవ నది మీద పూల ప్రయాణం ప్రేమ పచ్చని చెట్టు మీద సీతాకోకల అలంకారం ప్రేమ వెన్నెల దీపానికి బంగారు కాంతుల సింగారం ప్రేమ గుండే గుండే ఎందుకు కొట్టుకుంటావంటే ప్రేమ కోసం అంటుంది

శవం నవ్వుతున్నది

ఊరును నమ్ముకొని, మనుషుల నమ్ముకొని, మానవత్వాన్ని నమ్ముకొని, పెళ్ళాం పిల్లల రెక్కల కష్టంతో సాదుకొని కీళ్ళు అరిగి, ఎముకలు విరిగి, మనసు నలిగి, పెరిగి పెరిగి వృద్దమైన, పోరి పోరి రాలిపోయిన ఈ పువ్వుకు తన నీడను నిషేధిస్తే, నడిచి నడిచి ఆగిపోయిన తన నడకల వాడలో యాత్రను నిరాకరిస్తే తన ఊరే తనను అరిష్టమంటే నిన్నటి తన నేల మీద వీళ్ళు ఎన్నాళ్లుంటారని ఈనాటి వృద్ధ శవం నవ్వుతున్నది అసమాన పోరులో చిద్రమై పోయి ఇంటికి వచ్చిన వీర శరీరం నవ్వుతున్నది వలస బాటలో తిరిగివచ్చిన దుబాయి శవం నవ్వుతున్నది ఊరికవతల చెట్టుకు వేలాడిన ఎండిన డొక్కల పడుగు పేకల ఆస్థి పంజరం నవ్వుతున్నది పత్తి చేనులో మిత్తికి బలైన బక్కెద్దులాంటి బడుగు నల్ల కాయం నవ్వుతున్నది అన్ని నమ్మకాలు వమ్ము చేసిన మూర్ఖ, మూఢ నమ్మకాల వ్యవస్థను చూసి సభ్య సమాజం నవ్వుతున్నది.