ఐ లవ్ యూ బుధ్ధా!
*ఐ లవ్ యూ బుధ్ధా!* నిన్ను ప్రేమిస్తున్నాను బుధ్ధా! మనుషులను మోసం చేసే దేవుడివని ప్రకటించుకోనందుకు నీ మాటలనూ మా అనుభవం గీటురాయి మీద పరీక్షించుకొమ్మన్నందుకు నిన్ను ప్రేమిస్తున్నాను బుధ్ధా! సుఖ దుఃఖాలను గత జన్మ కర్మలకు ముడివేయనందుకు పాప పుణ్యాలను స్వర్గ నరకాల ఆశాభయాలుగా చేయనందుకు నిన్ను ప్రేమిస్తున్నాను బుధ్ధా! *** బుధ్ధా! వీళ్ళ దృష్టిలో దేవుడంటే! స్వర్గ నరకాల నియంత్రించే ఒక నియంత కదా! ఎన్ని తలలు ఎన్ని విచ్చు కత్తులు ఎన్ని చర్నాకోలలు మరెన్ని చండ శాసనాలు అతని భ్రమిత అంశతో పుట్టిన పాలక వర్గాల ప్రతినిధి కదా బుద్ధా! దేవుడంటే! *** బుధ్ధా! నువ్వు నా లోకం సంగతుల కార్య కారణాలు చెప్పే సూర్యునివి నా అంతర్లోకం లోతుల ప్రతీత సముత్పాద్యను విప్పే చంద్రునివి అందుకే, నిన్ను నా నిజ జీవిత సహచరుడంటాను బుధ్ధా! నువ్వు అష్టాంగాలను ఎనిమిది సూత్రాలతో అల్లుకున్నవాడివి అందుకే, నిన్ను నా మహాభినిష్క్రమణ సూత్రధారివి అంటాను బుధ్ధా! బుధ్ధా! నీ బోధలో నా దృష్టి విశ్వం కన్ను తెరిచే సూర్యబింబం నా సంకల్పం పాలపుంతలు ప్రవహించే దోసిలి ద్రోణి నా వచనం సృష్టిని ఊయలలూపే పాపాయి నవ్వు నా కర్మ పచ్చని చెట్టును తల మీద...