ఎవరమ్మా మీరు ? రక్తాన్ని పసి పాపలుగా పాల ధారలుగా నీటిని కన్నీటి ప్రవాహాలుగా శ్రమ పునాదులుగా విరూపాలను స్వరూపాలుగా నిలబెట్టే మీరెవరమ్మా మాటలు నేర్పే మీరు పాటలు నేర్పే మీరు పనులు నేర్పే మీరు కళలు నేర్పే మీరు సున్నితపు బతుకు దారాల అల్లిక నేర్పే మీరెవరమ్మా కరుణ చిందే మీరు ప్రేమ పంచే మీరు పరువుగ బతికే మీరు మర్యాదగ మెలిగే మీరు జీవన సూత్రాల సుందర పరదాలు వేలాడదీసిన మీరెవరమ్మా *** సాలు సాలున కోతకోసీ పంట దహనమౌతున్న రైతుల్లా పోగు పోగును అతుకు వేసీ దారం ఉరియౌతున్న సాలెల్లా పితుకు పితుకును అతుకువేసి కుంపటి చితి ఔతున్న కంసాలుల్లా రోజు రోజూ కూలి చేసి తేనె దగ్ధమౌతున్న రాణీ ఈగల్లా పుటుకనుంచి చావుదాకా నిత్య చావు చెరల పడుతున్న మీరెవరమ్మా ఎవరమ్మా మీరు చీకటి కొట్టాల్లో సూర్య బింబాల్లా కాటుకలో జ...
Posts
Showing posts from April, 2017