Posts

Featured post

ఐ లవ్ యూ బుధ్ధా!

*ఐ లవ్ యూ బుధ్ధా!* నిన్ను ప్రేమిస్తున్నాను బుధ్ధా! మనుషులను మోసం చేసే దేవుడివని ప్రకటించుకోనందుకు నీ మాటలనూ మా అనుభవం గీటురాయి మీద పరీక్షించుకొమ్మన్నందుకు నిన్ను ప్రేమిస్తున్నాను బుధ్ధా! సుఖ దుఃఖాలను గత జన్మ కర్మలకు ముడివేయనందుకు పాప పుణ్యాలను స్వర్గ నరకాల ఆశాభయాలుగా చేయనందుకు నిన్ను ప్రేమిస్తున్నాను బుధ్ధా! *** బుధ్ధా! వీళ్ళ దృష్టిలో దేవుడంటే! స్వర్గ నరకాల నియంత్రించే ఒక నియంత కదా! ఎన్ని తలలు ఎన్ని విచ్చు కత్తులు ఎన్ని చర్నాకోలలు మరెన్ని చండ శాసనాలు అతని భ్రమిత అంశతో పుట్టిన పాలక వర్గాల ప్రతినిధి కదా బుద్ధా! దేవుడంటే! *** బుధ్ధా! నువ్వు నా లోకం సంగతుల కార్య కారణాలు చెప్పే సూర్యునివి నా అంతర్లోకం లోతుల ప్రతీత సముత్పాద్యను విప్పే చంద్రునివి అందుకే, నిన్ను నా నిజ జీవిత సహచరుడంటాను బుధ్ధా! నువ్వు అష్టాంగాలను ఎనిమిది సూత్రాలతో అల్లుకున్నవాడివి అందుకే, నిన్ను నా మహాభినిష్క్రమణ సూత్రధారివి అంటాను బుధ్ధా! బుధ్ధా! నీ బోధలో నా దృష్టి విశ్వం కన్ను తెరిచే సూర్యబింబం నా సంకల్పం పాలపుంతలు ప్రవహించే దోసిలి ద్రోణి నా వచనం సృష్టిని ఊయలలూపే పాపాయి నవ్వు నా కర్మ పచ్చని చెట్టును తల మీద...
ఎవరమ్మా మీరు ?                                       రక్తాన్ని పసి పాపలుగా పాల ధారలుగా నీటిని కన్నీటి ప్రవాహాలుగా శ్రమ పునాదులుగా విరూపాలను స్వరూపాలుగా నిలబెట్టే మీరెవరమ్మా మాటలు నేర్పే మీరు పాటలు నేర్పే మీరు పనులు నేర్పే మీరు కళలు నేర్పే మీరు సున్నితపు బతుకు దారాల అల్లిక నేర్పే మీరెవరమ్మా కరుణ చిందే మీరు ప్రేమ పంచే మీరు పరువుగ బతికే మీరు మర్యాదగ మెలిగే మీరు జీవన సూత్రాల సుందర పరదాలు వేలాడదీసిన మీరెవరమ్మా *** సాలు సాలున కోతకోసీ పంట దహనమౌతున్న రైతుల్లా పోగు పోగును అతుకు వేసీ దారం ఉరియౌతున్న సాలెల్లా పితుకు పితుకును అతుకువేసి కుంపటి చితి ఔతున్న కంసాలుల్లా రోజు రోజూ కూలి చేసి తేనె దగ్ధమౌతున్న రాణీ ఈగల్లా పుటుకనుంచి చావుదాకా నిత్య చావు చెరల పడుతున్న మీరెవరమ్మా ఎవరమ్మా మీరు చీకటి కొట్టాల్లో సూర్య బింబాల్లా కాటుకలో జ...
కవిత్వాన్ని నువ్వు రాయలేవు తనను రాయించుకుంటుంది కవిత్వం మేఘాలను పోగేసి వానను గ్లిజరిన్ కన్నీళ్లను నటించి   దుఖ్ఖాన్నీ కృత్రిమ రంగులేసి   ఒక కొత్త పువ్వును నువ్వు సృష్టించలేవు పెటిల్లున విచ్చుకత్తుల మెరుపులతో గుండె మేఘం చీలి చేతులు పట్టలేని దయతో ఒకసారి తన్నుకు వచ్చిన వరద తాకి బద్దలైన యెద చెరువు కట్ట చిమ్మిన ప్రవాహంలా మరోసారి అగ్నినీ అమృతాన్నీ కలగలిపి ఆకాశాన్నీ భూమినీ ముడివేసి పాతాళాన్నీ స్వర్గాన్నీ తోసేసి ఒక వర్ణ ప్రపంచ సుమంగా ఇంకో సారి కవిత్వం నిన్ను రాయించుకుంటుంది నువ్వు కవి వనుకుంటావు నిన్ను తన దూతవనుకుంటుంది కవిత్వం

పనిమంతునివై

Image
సూర్యుడా! ప్రతి రోజూ   రగిలిపోయే నీ ముఖ చిత్రాన్ని ఆకాశం ఆవిష్కరిస్తున్నా డి విటమిన్ కోసమో ఎం విటమిన్ కోసమో తప్ప వాస్తవం ఎరుపును చూడలేక మేం చలువ కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతున్నాం రైతుల శవాల మీద బంగారు పిచ్చుకలు ఎగురుతున్నాయని విద్యార్థి మెదళ్లకు పట్టిన   సామాజిక ఆలోచనల తుప్పును ప్రపంచ విశ్వవిద్యాలయాలు దులుపబోతున్నాయని ఖండాంతరాలలో వన్నెకెక్కిన చాతుర్వర్ణ వ్యవస్థ పటిష్టతకు ప్రభువులు పీఠం వేసి కూర్చోబెడుతున్నారని వ్యాసాలుగా , కథలుగా , కవిత్వంగా జయజయ ధ్వానాల ఘోషల మధ్య   బుగ్గ కార్ల హోర్ల మధ్య   సమసమాజ రథాన్ని ఆరు లైన్ల రోడ్ల మీద నడిపిస్తున్నాం నీ సంగతి తెలియందేముంది నక్కల్నీ , పులుల్నీ , రాబందుల్నీ దళారుల్నీ , దగాకోరుల్నీ , రాజ ముద్రల్నీ   కిరణాల బాకులతో వెంటాడుతూనే ఉన్నావ్ మరణాన్ని పరిహసించిన అక్షరాలతో మళ్ళీ మళ్ళీ గొంతెత్తి బహిరంగ సభల్లో నినదిస్తూనే ఉన్నావ్ సూర్యుడా! నీ ముఖ చిత్రం గాజు కళ్ళల్లో రాజుకొని జనారణ్యం అంటుకొని నిప్పుల్లో కడిగిన అక్షరాలే మిగలనీ

మానవ నక్షత్రాలు

Image