ఒక్కసారి రారా తమ్మీ!

నిండూ ఎన్నీల నాడు ఓ లచ్చ గుమ్మడి
పొంగినాది పాల వాగు ఓ లచ్చ గుమ్మడి
||నిండూ||
పాల వాగు పారుతుంటే ఓ లచ్చ గుమ్మడి
మా మనుసు నీరు అయ్యి పారే ఓ లచ్చ గుమ్మడి
||నిండూ||
నీళ్ళ మెరుపు ఎంత సలువ ఓ లచ్చ గుమ్మడి
ఆ నీళ్ళ సప్పుడెంత సుతి ఓ లచ్చ గుమ్మడి
||నిండూ||
పొట్టా కూటికి జచ్చి ఓ లచ్చ గుమ్మడి
పొద్దంత పని జేసి ఓ లచ్చ గుమ్మడి
||నిండూ||
అవ్వా అయ్యా నిన్నూ దలిసి ఓ లచ్చ గుమ్మడి
ఒక్క ముద్దా తిందామని ఓ లచ్చ గుమ్మడి
||నిండూ||
అన్నంలోన నిన్నూ జూసి ఓ లచ్చ గుమ్మడి
ముద్దాలన్నీ వాగులేసే ఓ లచ్చ గుమ్మడి
||నిండూ||
సుక్క పోద్దూవోలె నువ్వు ఓ లచ్చ గుమ్మడి
ఒక్కసారి రారా తమ్మీ ఓ లచ్చ గుమ్మడి
||నిండూ||
నిండూ ఎన్నీల నాడు ఓ లచ్చ గుమ్మడి
పొంగినాది పాల వాగు ఓ లచ్చ గుమ్మడి

Comments

Popular posts from this blog