సూర్యుడా! ప్రతి రోజూ రగిలిపోయే నీ ముఖ చిత్రాన్ని ఆకాశం ఆవిష్కరిస్తున్నా డి విటమిన్ కోసమో ఎం విటమిన్ కోసమో తప్ప వాస్తవం ఎరుపును చూడలేక మేం చలువ కళ్ళద్దాలు పెట్టుకొని తిరుగుతున్నాం రైతుల శవాల మీద బంగారు పిచ్చుకలు ఎగురుతున్నాయని విద్యార్థి మెదళ్లకు పట్టిన సామాజిక ఆలోచనల తుప్పును ప్రపంచ విశ్వవిద్యాలయాలు దులుపబోతున్నాయని ఖండాంతరాలలో వన్నెకెక్కిన చాతుర్వర్ణ వ్యవస్థ పటిష్టతకు ప్రభువులు పీఠం వేసి కూర్చోబెడుతున్నారని వ్యాసాలుగా , కథలుగా , కవిత్వంగా జయజయ ధ్వానాల ఘోషల మధ్య బుగ్గ కార్ల హోర్ల మధ్య సమసమాజ రథాన్ని ఆరు లైన్ల రోడ్ల మీద నడిపిస్తున్నాం నీ సంగతి తెలియందేముంది నక్కల్నీ , పులుల్నీ , రాబందుల్నీ దళారుల్నీ , దగాకోరుల్నీ , రాజ ముద్రల్నీ కిరణాల బాకులతో వెంటాడుతూనే ఉన్నావ్ మరణాన్ని పరిహసించిన అక్షరాలతో మళ్ళీ మళ్ళీ గొంతెత్తి బహిరంగ సభల్లో నినదిస్తూనే ఉన్నావ్ సూర్యుడా! నీ ముఖ చిత్రం గాజు కళ్ళల్లో రాజుకొని జనారణ్యం అంటుకొని నిప్పుల్లో కడిగిన అక్షరాలే మిగలనీ
Popular posts from this blog
ఒక్కసారి రారా తమ్మీ!
నిండూ ఎన్నీల నాడు ఓ లచ్చ గుమ్మడి పొంగినాది పాల వాగు ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| పాల వాగు పారుతుంటే ఓ లచ్చ గుమ్మడి మా మనుసు నీరు అయ్యి పారే ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| నీళ్ళ మెరుపు ఎంత సలువ ఓ లచ్చ గుమ్మడి ఆ నీళ్ళ సప్పుడెంత సుతి ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| పొట్టా కూటికి జచ్చి ఓ లచ్చ గుమ్మడి పొద్దంత పని జేసి ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| అవ్వా అయ్యా నిన్నూ దలిసి ఓ లచ్చ గుమ్మడి ఒక్క ముద్దా తిందామని ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| అన్నంలోన నిన్నూ జూసి ఓ లచ్చ గుమ్మడి ముద్దాలన్నీ వాగులేసే ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| సుక్క పోద్దూవోలె నువ్వు ఓ లచ్చ గుమ్మడి ఒక్కసారి రారా తమ్మీ ఓ లచ్చ గుమ్మడి ||నిండూ|| నిండూ ఎన్నీల నాడు ఓ లచ్చ గుమ్మడి పొంగినాది పాల వాగు ఓ లచ్చ గుమ్మడి
కవిత్వాన్ని నువ్వు రాయలేవు తనను రాయించుకుంటుంది కవిత్వం మేఘాలను పోగేసి వానను గ్లిజరిన్ కన్నీళ్లను నటించి దుఖ్ఖాన్నీ కృత్రిమ రంగులేసి ఒక కొత్త పువ్వును నువ్వు సృష్టించలేవు పెటిల్లున విచ్చుకత్తుల మెరుపులతో గుండె మేఘం చీలి చేతులు పట్టలేని దయతో ఒకసారి తన్నుకు వచ్చిన వరద తాకి బద్దలైన యెద చెరువు కట్ట చిమ్మిన ప్రవాహంలా మరోసారి అగ్నినీ అమృతాన్నీ కలగలిపి ఆకాశాన్నీ భూమినీ ముడివేసి పాతాళాన్నీ స్వర్గాన్నీ తోసేసి ఒక వర్ణ ప్రపంచ సుమంగా ఇంకో సారి కవిత్వం నిన్ను రాయించుకుంటుంది నువ్వు కవి వనుకుంటావు నిన్ను తన దూతవనుకుంటుంది కవిత్వం
Comments
Post a Comment